సీడీఎస్‌ మృతిపై నవ్వుల ఎమోజీలు పెట్టడం బాధించింది

సీడీఎస్‌ మృతిపై నవ్వుల ఎమోజీలు పెట్టడం బాధించింది

కేరళకు చెందిన సినీ దర్శకుడు అలీ అక్బర్ మతం మార్చుకున్నాడు. హిందూ మతం స్వీకరించిన ఆయన తన పేరును రామసింహగా మార్చుకున్నట్లు ప్రకటించాడు.  సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతికి నివాళిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కొంత మంది ముస్లింలు నవ్వుల (స్మైలీ) ఎమోజీలు పెట్టారని, ఇది తనను ఎంతో బాధించిందని అన్నాడు. దానికి నిరసనగా తాను మతం మారాలని నిర్ణయించుకున్నానని ఈ మలయాళీ డైరెక్టర్ చెప్పారు. ఇలా యోధుల మృతిని అపహాస్యం చేసే ప్రవర్తనను మత పెద్దలు ఎందుకు సరిదిద్దడం లేదని ఆయన ప్రశ్నించాడు. తనతో పాటు తన భార్య కూడా మతం మార్చుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన బిడ్డలను మతం మారాలని ఎటువంటి బలవంతం చేయబోనని, వారి ఇష్టానికి వదిలేస్తానని చెప్పాడు.