బిర్యానీలో కోడి తలకాయ : అన్ని బిర్యానీ సెంటర్లలో తనిఖీలు

హోటల్ నుంచి తీసువచ్చిన బిర్యానీ పార్శిల్ లో తనకు కోడి తల కనిపించిందంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కేరళ ఫుడ్ సేప్టీ డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. తిరూర్ లోని ఆ హోటల్ ను మూసేయించింది.

ఏజూరుకు చెందిన ప్రతిభ నవంబర్ 4న ముత్తూరులోని పొరోట స్టాల్‌ నుంచి నాలుగు బిర్యానీ ప్యాకెట్లను పార్శిల్‌గా తీసుకొచ్చింది. పార్శిల్ ప్యాకెట్‌లలో ఒకదానిలో కోడి తల కనిపించినట్టు సమాచారం. దీంతో ఆమె తిరూర్ మున్సిపాలిటీలోని ఆరోగ్యశాఖ, ఆహార భద్రతా విభాగానికి ఫిర్యాదు చేసింది.

Also Read :- రష్మిక ఫేక్ వీడియో వైరల్

నవంబర 5న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అధికారులు స్టాల్ లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఫిర్యాదుదారుని భోజనశాలకు పిలిపించారు. వారు పార్శిల్‌ను పరిశీలించి, ఆ స్టాల్ ను మూసివేశారు.