మధ్యప్రదేశ్‌లోని ఉజ్జియిని మహాకాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయన మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే ‘భోగ్ హారతి’ సమయంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్.. దైవ దర్శనం చేసుకున్నారని ఉజ్జయిని ఆలయ అధికారి గణేశ్ ధకడ్ ప్రకటన విడుదల చేశారు. దేవుడి శేష వస్త్రం కప్పి.. గవర్నర్‌ను ఆలయ అధికారులు స్వాగతం చెప్పారని, ఆయన దాదాపు 40 నిమిషాల పాటు ఆలయంలో ఉన్నారని పేర్కొన్నారు.
Madhya Pradesh | Kerala Governor Arif Mohammed Khan offered prayers at Mahakaleshwar temple in Ujjain today pic.twitter.com/xbIe9O3ELZ
— ANI (@ANI) January 8, 2022
కాగా, కరోనా ఆంక్షల నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా ఉజ్జయిని ఆలయ గర్భ గుడిలోకి భక్తులను అనుమతించడం నిలిపేశారు. దీంతో గవర్నర్ గర్భ గుడి వాకిలి నుంచి స్వామి దర్శనం చేసుకున్నారు.