నాగ్పూర్: తెల్లారితే తల్లి పుట్టిన రోజు. ఫ్లైట్ దిగాక డైరెక్ట్ గా నాగ్పూర్ వెళ్లి, అమ్మను సర్ ప్రైజ్ చేయాలనుకున్నడు. కానీ ఫ్లైట్ దిగకుండానే కన్నుమూసిండు.. ఫ్లైట్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ కెప్టెన్ దీపక్ వసంత్ సాథె కుటుంబం ఎదుర్కొన్న విషాదమిది. భార్యతో కలిసి సాథె ముంబయిలో ఉంటుండగా, వాళ్ల అమ్మ నీలా సాథె నాగ్పూర్ లో ఉంటున్నారు . శనివారం నీలా సాథె 84వ పుట్టిన రోజు కావడంతో ఫ్లైట్స్ నడిస్తే నాగ్ పూర్ వెళ్లాలని సాథె ప్లాన్చేసుకున్నాడు. సడెన్ విజిట్తో తల్లిని సర్ప్రైజ్చేయాలని అనుకున్నాడని సాథె దగ్గరి బంధువు చెప్పారు. లాక్డౌన్ కారణంగా సాథె చివరిసారిగా మార్చిలో నాగ్ పూర్ వచ్చాడని నీల చెప్పారు. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తుండే వాడన్నారు. ‘వైరస్ కేసులు ఎక్కువైతున్నయ్, బయట కాలుపెట్టొద్దమ్మా’ అని తనకు జాగ్రత్తలు చెప్పాడన్నారు. తన బిడ్డచదువులో, ఆటల్లో.. అన్నింట్లో ఫస్టుండేవాడని చెప్పారు. ఎయిర్ ఫోర్సులో ఉన్నపుడు కూడా ఎన్నో బహుమతులు గెల్చుకున్నాడన్నారు. అత్యంత అరుదైన ‘స్వార్డ్ ఆఫ్ హానర్’ గౌరవాన్ని సాథె పొందాడని వివరించారు.
For More News..