ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్​లో జాడ కనిపెట్టాలంటే జాగిలాలే దిక్కు!

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్​లో జాడ కనిపెట్టాలంటే జాగిలాలే దిక్కు!
  • ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్​లోకేరళ జాగిలాల సెర్చ్ ఆపరేషన్‌‌‌‌
  • తదేహాలను వెలికితీసే సామర్థ్యం
  • ర్కోటిక్‌‌‌‌, ఆర్గనైజ్డ్‌‌‌‌  క్రైం కంట్రోల్‌‌‌‌సెల్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌తో ఆపరేషన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మనుషులు, రోబోలు, డ్రోన్లు కూడా వెళ్లలేని ప్రదేశాల్లో పోలీస్  జాగిలాలతో నిర్వహించే సర్చ్  ఆపరేషన్లు సక్సెస్‌‌‌‌  అవుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన మృతదేహాల జాడను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తాయి ఆ జాగిలాలు. 5 మీటర్ల లోతుల్లో ఉన్న పేలుడు పదార్థాలు, 20 మీటర్ల దూరంలో ఉన్న గంజాయి, డ్రగ్స్  సహా  ఇతర మత్తు పదార్థాలను వాసనతో పట్టేస్తున్నాయి. ఇలాంటిదే ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌  రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌లో ఒక మృతదేహాన్ని గుర్తించడంలో జాగిలాలే కీలకపాత్ర పోషించాయి. 

ఆరు అడుగుల లోతులో కూరుకుపోయిన రాబిన్స్  కంపెనీ టీబీఎం ఎరెక్టర్  ఆపరేటర్  గురుప్రీత్  సింగ్ (40) డెడ్ బాడీని గుర్తించడంలో కేరళ పోలీసుల ‘క్యాడెవర్‌‌‌‌‌‌‌‌’ డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ ప్రతిభ కనబరించింది. ఇదే తరహాలో రాష్ట్ర పోలీసు డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కూడా రెస్క్యూ స్క్వాడ్‌‌‌‌ను నియమించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించి నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించేలా జాగిలాలకు ట్రైనింగ్‌‌‌‌  ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 316 కెనైన్స్‌‌‌‌ ఆన్‌‌‌‌డ్యూటీ 

కేరళ, చెన్నై సహా ఇతర సముద్రతీర ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర పోలీసులు జర్మన్‌‌‌‌ బ్రీడ్‌‌‌‌కు చెందిన క్యాడెవర్‌‌‌‌  డాగ్స్‌‌‌‌కు మృతదేహాల జాడను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌  ప్రమాదంలో క్యాడెవర్‌‌‌‌  ప్రతిభకు రాష్ట్ర పోలీసులు కూడా ఆసక్తి చూపారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి స్క్వాడ్‌‌‌‌ను తయారు చేసేందుకు మొయినాబాద్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌  ఇంటెలిజెన్స్  ట్రైనింగ్‌‌‌‌  అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్  కోర్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 316 కెనైన్స్‌‌‌‌ (పోలీస్ జాగిలాలు) రాష్ట్ర పోలీస్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో విధులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్  సహా అన్ని జిల్లాల యూనిట్లలో పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా గత నెల 28న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌  ఇంటెలిజెన్స్  ట్రైనింగ్‌‌‌‌  అకాడమీ నుంచి 24వ బ్యాచ్‌‌‌‌కు చెందిన 72 జాగిలాలు పాసింగ్‌‌‌‌ అవుట్‌‌‌‌  పరేడ్ నిర్వహించాయి. వీటిలో 37 డాగ్‌‌‌‌  స్క్వాడ్స్‌‌‌‌ ను రాష్ట్ర పోలీసు యూనిట్లకు కేటాయించారు.

కాకర్‌‌‌‌‌‌‌‌కు 40 రెట్లు వాసన శక్తి,20 రెట్లు వినికిడి శక్తి అధికం

రాష్ట్ర పోలీస్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఎక్కువగా లాబ్రాడార్‌‌‌‌‌‌‌‌, డాబర్‌‌‌‌మ్యాన్‌‌‌‌, ఆల్సీషియన్‌‌‌‌, గోల్డెన్‌‌‌‌  రిట్రీవర్‌‌‌‌, డాల్మేషన్‌‌‌‌, జర్మన్‌‌‌‌  షెపర్డ్‌‌‌‌  జాతులకు చెందిన జాగిలాలను వినియోగిస్తున్నారు. ఎయిర్‌‌‌‌పోర్టులో చెకింగ్  కోసం కాకర్‌‌‌‌‌‌‌‌స్పెనియన్‌‌‌‌  డాగ్స్‌‌‌‌ విధులు నిర్వహిస్తున్నాయి. వీటికి సాధారణ కుక్కలతో పోలిస్తే వాసన చూసే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, 10 రెట్లు ఎక్కువగా కంటిచూపు ఉంటుంది. అకాడమీలో జాగిలాలకు 8 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎలాంటి వస్తువునైనా వాసనతో పట్టేసేలా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌  ఇస్తారు.

24 బ్యాచుల్లో 843 కెనైన్స్‌‌‌‌  ట్రైనింగ్‌‌‌‌  పూర్తి

మొయినాబాద్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్‌‌‌‌ అకాడమీలో 2004 నుంచి గత నెల వరకు 843 కెనైన్స్‌‌‌‌  శిక్షణ పూర్తి చేసుకున్నాయి. 1,205 మంది హ్యాండ్లర్ల సారథ్యంలో పోలీసులతో కలిసి కేసులను ఛేదిస్తున్నాయి. ప్రధానంగా దొంగలను పట్టించే ట్రాకర్స్, గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను గుర్తించే నార్కొటిక్స్‌‌‌‌ జాగిలాలు, పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫ్ఫర్‌‌‌‌‌‌‌‌  డాగ్స్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్‌‌‌‌, గంజాయిని ట్రేస్‌‌‌‌ చేసేందుకు నార్కొటిక్‌‌‌‌, ఆర్గనైజ్డ్‌‌‌‌  క్రైం కంట్రోల్‌‌‌‌ సెల్‌‌‌‌  ద్వారా ట్రాకర్  డాగ్స్‌‌‌‌ను వినియోగిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని పార్సిల్‌‌‌‌  కౌంటర్ల వద్ద నార్కొటిక్‌‌‌‌  స్క్వాడ్స్‌‌‌‌తో తనిఖీలు చేస్తున్నారు. అలాగే, గంజాయి సేల్స్ జరుగుతున్న హాట్‌‌‌‌స్పాట్స్‌‌‌‌లో డాగ్‌‌‌‌స్క్వాడ్‌‌‌‌ను వినియోగిస్తున్నారు.