
ఎన్ని చర్యలు చేపట్టిన ర్యాగింగ్ భూతం వదలడం లేదు. పరిచయం పేరుతో కొత్తగా కాలేజీలో చేరే విద్యార్థులను సీనియర్లు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. జూనియర్లపట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ఒక్కోసారి భౌతిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ర్యాగింగ్ తట్టుకోలేక కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం.. తాజా కేరళలో ఓ కాలేజీలో ఇద్దరు జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు దారుణంగా హింసించారు.
కేరళలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. తిరువనంతపురంలోని కరియావట్టం ప్రభుత్వ కాలేజీలో పరిచయం పేరుతో దారుణంగా విద్యార్థులను హింసించారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కొట్టి, ఉమ్మివేసిన నీటిని బలవంతంగా తాగించారు. ఈ ఘటనపై విద్యార్థులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కళాశాల ర్యాగింగ్ నిరోధక విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ర్యాగింగ్‌లో పాల్గొన్న విద్యార్థులను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఇటీవల జూనియర్ నర్సింగ్ విద్యా్ర్థిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఇది కేరళలో తీవ్రఆగ్రహానికి గురి చేయగా.. ఇంతలోనే మరో ఘటన జరగడం చర్చనీయాంశమైంది.