కేరళలో బాబా సజీవ సమాధిలో ట్విస్ట్.. కుటుంబమే చంపీ సమాధి అని చెప్పిందా.. పోలీసులు ఏం తేల్చారు?

కేరళలో బాబా సజీవ సమాధిలో ట్విస్ట్.. కుటుంబమే చంపీ సమాధి అని చెప్పిందా.. పోలీసులు ఏం తేల్చారు?

కేరళలో ఓ బాబా సజీవ సమాధి కావడం వివాదాస్పదంగా మారింది. బాబా సజీవ సమాధి అయ్యారని కుటుంబ సభ్యులు అంటుంటే.. ఆయనను చంపేసి నాటకాలాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన సమాధిని తీయాలని కొందరు, కుదరని కుటుంబ సభ్యులు.. పోలీసుల ఎంట్రీ ఇలా ఆద్యంతం వివాదాస్పదంగా మారిందీ కేసు. కలెక్టర్ ఎంట్రీ ఇచ్చినా లాభం లేకపోయింది.  ఎంతకూ తెగని ఈ కేసు చివరికి కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో సమాధిని తవ్వి చూస్తే చనిపోయిన బాబా మృతదేహం ధ్యాన స్థితిలో కూర్చొని ఉండటం చూసి అంతా షాక్..!  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ బాబా సజీవ సమాధి కేసులో ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది..? వివరాలు ఇలా ఉన్నాయి. 

 కేరళలోని తిరువనంతపురంకు చెందిన గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ అనే బాబా ఇటీవలే సజీవ సమాధి అయ్యారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఆయన కుటుంబ సభ్యులే పోస్టర్ల ద్వారా స్థానికులు అందరికీ తెలిసేలా చేశారు. పోస్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న ప్రజలు అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎవరికీ తెలియకుండా ఓ దేవాలయం సమీపంలో అతడిని పూడ్చి పెట్టడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని భావించారు. ఈక్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులను అందరూ ప్రశ్నించగా.. ఎవరికీ తెలియకుండానే తనను జీవ సమాధి చేయాలని మణ్యన్ కోరినట్లు ఆయన కుమారులు సనందన్, రాజేశన్ వివరించారు. 

బాబా కుటుంబ సభ్యులు చెప్పేది అంతగా నమ్మశక్యంగా లేదని స్థానికులు, బంధువులు అందరూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు సేకరించిన పోలీసులు కలెక్టర్‌కు నివేదిక పంపించారు. ఈక్రమంలోనే సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవీ తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు.

ALSO READ | మేనకోడలినే బ్లాక్ మెయిల్ చేసిన నీచుడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యలో ట్విస్ట్

సమాధిని తవ్వాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ.. బాబా (మణ్యన్) కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. స్వామీజీ సమాధిని తవ్వనివ్వలేదు. సమాధి చుట్టూ ఉండి పోలీసులకు పోలీసులకు అడ్డంపడ్డారు.  దీంతో అధికారులు వెనక్కి తగ్గి న్యాయపరంగా వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అలా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. 

ఈక్రమంలోనే విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మణ్యన్ జీవ సమాధిని తవ్వాలని జనవరి 15వ తేదీన పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలోనే పోలీసులు గురువారం ఉదయం 7 గంటలకు బాబా సమాధిని తవ్వారు. కాంక్రీట్‌తో కట్టిన సమాధిని పగులగొట్టారు. సమాధిలో బాబా స్థితిని చూసీ పోలీసులతో పాటు అందరూ షాక్ అయ్యారు. సమాధిలో బాబా  ధ్యాన స్థితిలో ఛాతి వరకు పూజా సామాగ్రి కప్పి ఉండి కనిపించాడు. ఎట్టకేలకు పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటు తీశారు. ఛాతి వరకు పూజా సామగ్రితో ధ్యానంలో కూర్చుని ఉన్నట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్లు స్పష్టం చేశారు.