తిరువనంతపురం: మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు111 ఏండ్ల జైలు శిక్ష వేసింది. అంతేగాకుండా రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. గడువులోగా చెల్లించకుంటే శిక్ష మరో ఏడాది పొడిగిస్తామని హెచ్చరించింది.
కేరళకు చెందిన మనోజ్(44) ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన ఇంట్లో ట్యూషన్ చెప్పేవాడు. ఐదేండ్ల క్రితం తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన ఇంటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఫొటోలు తీసి వాటిని ఇతరులకు కూడా షేర్ చేశాడు. దాంతో భయపడిన బాలిక.. ట్యూషన్‌కు వెళ్లడమే మానేసింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాఫ్తు జరిపిన పోలీసులు.. బాలికపై అత్యాచారం నిజమేనని తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.