Ranji Trophy 2025: గుజరాత్‌పై థ్రిల్లింగ్ సెమీస్.. 74 ఏళ్ళలో తొలిసారి రంజీ ఫైనల్లో కేరళ

Ranji Trophy 2025: గుజరాత్‌పై థ్రిల్లింగ్ సెమీస్.. 74 ఏళ్ళలో తొలిసారి రంజీ ఫైనల్లో కేరళ

రంజీ ట్రోఫీలో కేరళ తొలిసారి ఫైనల్ కు చేరుకుందు. శుక్రవారం (ఫిబ్రవరి 21) గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ను డ్రా చేసుకున్న కేరళ.. తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగుల ఆధిక్యం సంపాదించి ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఐదవ రోజు ఆటలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఫైనల్లో అడుగు పెట్టాలంటే మూడు పరుగులు కావాలి. మరోవైపు కేరళ చివరి వికెట్ తీయాలి. ఈ దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఆదిత్య సర్వతే చివరి వికెట్ తీయడంతో కేరళకు తొలి ఇన్నింగ్స్ లో 2 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దీంతో రంజీ తొలిసారి ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించారు.

రంజీ ట్రోఫీ రూల్స్ ప్రకారం మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ లో ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. తొలి ఇన్నింగ్స్ లో కేరళ 457 పరుగులకు చేస్తే గుజరాత్ 455 పరులకు పరిమితమైంది. దీంతో కేరళ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో సాగాయి. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ లేకుండా కేరళ ఫైనల్ కు వెళ్లడం విశేషం. 1951-52 రంజీ ట్రోఫీలో తొలిసారి అరంగేట్రం చేసిన తర్వాత ఇప్పటివరకు కేరళ ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. 74 ఏళ్ళ తర్వాత ఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. 

ALSO READ | Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌.. తుది జట్టు నుంచి క్లాసన్‌ను తప్పించిన సౌతాఫ్రికా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన కేరళ 457 పరుగులు చేసింది. మొహమ్మద్ అజారుద్దీన్ 177 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో 455 పరుగులు చేసింది. ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ 4 వికెట్లను 114 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. మరో సెమీ ఫైనల్లో విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబైకి షాక్ ఇచ్చింది. సెమీస్ లో విదర్భ 80 పరుగుల తేడాతో ముంబైని ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.