జీరో హంగర్​ స్టేట్​ కేరళ

జీరో హంగర్​ స్టేట్​ కేరళ

ప్రపంచం నుంచి దారిద్ర్యం, ఆకలి బాధలను తరిమి వేయాలనే ధ్యేయంతో మిలీనియం డెవలప్మెంట్​ గోల్స్​ స్థానంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాను 2015, సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించింది. 2016, జనవరి నుంచి 2030 డిసెంబర్​ వరకు ఈ లక్ష్యాలను సాధించాలని తలపెట్టారు. వీటిని 193 దేశాలు అంగీకరించాయి. ఇందులో ఇండియా కూడా ఉంది. 

ప్రపంచ జనాభాలో 17శాతానికి పైగా జనాభాను ఇండియా కలిగి ఉంది. అందుకే ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇండియా లక్ష్యాల సాధన కీలకమైంది. ప్రపంచ జనాభాలో 1/6 వంతు మనదేశంలో ఉంది. కాబట్టి ఎస్​డీజీ లక్ష్యాలను ఇండియా సాధించలేకపోతే ప్రపంచం కూడా సాధించలేదు. మన దేశంలో చాలా పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగానే ఉన్నాయి. ఉదా: ఆయుష్మాన్​ భారత్​ ( ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) 50 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకం ఇది. సుస్థిరాభివృద్ధి గోల్ మూడైన గుడ్​ హెల్త్, వెల్​ బీయింగ్ సాధనకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎస్​డీజీ 10 (అసమానతల తగ్గింపు)కు ఈ పథకం దోహదపడుతుంది. 

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్​ - 2019

రెండో ఎడిషన్​ను 2019 డిసెంబర్​లో ప్రకటించారు. 100 సూచీలు, 54 టార్గెట్స్​, 54 లక్ష్యాలతో ప్రకటించారు. అయితే 16 గోల్స్​కు ర్యాంకులు ప్రకటించారు. దేశ సగటు 60. మొదటి స్థానంలో కేరళ(70) ఉంది. చివరిస్థానంలో  బిహార్ (50) ఉంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులు (67) ఉన్నాయి.  

ఇండియా ఎస్​డీజీ ఇండెక్స్​ స్కోర్​ 66

రాష్ట్రాల స్కోర్​ 52 నుంచి 75 మధ్య, కేంద్ర పాలిత ప్రాంతాల స్కోరు 62 నుంచి 79 మధ్య ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎస్​డీజీ ఇండెక్స్​ను గణిస్తే మొదటి స్థానంలో కేరళ (75), రెండో స్థానంలో హిమాచల్​ప్రదేశ్​, తమిళనాడు (74),  ఆ తర్వాతి స్థానలో ఏపీ, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్​(72) స్కోర్​తో ముందంజలో ఉండగా, 52 స్కోర్​తో బిహార్ చివరి స్థానంలో ఉంది. ​కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానం చండీగఢ్​ (79), చివరి స్థానంలో దాద్రా నగర్​ హవేలీ డామన్​ డయ్యూ (62) ఉన్నాయి. 2020–21 ఎస్​డీజీ ఇండెక్స్​లో 15 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్రంట్​ రన్నర్​గా ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం అస్పిరెంట్​గా, ఏ ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం అచీవర్​గా లేవు. మిగిలినవి ఫర్ఫార్మర్​(14)గా ఉన్నాయి. 2019 నుంచి 2020 నాటికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్​ స్కోర్​లో ఎక్కువ పెరుగుదల గల రాష్ట్రం మిజోరాం. రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో ఉత్తరాఖండ్​ ఉన్నాయి. 

ప్రయోజనాలు 

ఎస్​డీజీ ఇండెక్స్​ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుపుతుంది. జాతీయస్థాయితో పోల్చితే తమ స్థితి ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రాధాన్యతా రంగాలను గుర్తించడానికి వీలు కలుగుతుంది. సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఏ అంశాల్లో డేటా గ్యాప్​ కనిపిస్తుందో తెలుస్తుంది. 

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్​ - 2018

ఎస్​డీజీ ఇండియా ఇండెక్స్ మొదటి ఎడిషన్​ను 2018లో ప్రకటించారు. ఇందులో 62 సూచీలు, 39 లక్ష్యాలు, 13 ఎస్​డీజీ గోల్స్​తో అనౌన్స్​ చేశారు. సరైన సమాచారం లేకపోవడంతో ఎస్​డీజీ 12, 13, 14, 17 లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. భారత్​ సగటు విలువ 57. మొదటి స్థానంలో 69 స్కోర్​తో హిమాచల్​ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. చివరి స్థానంలో 42 స్కోర్​తో ఉత్తర్​ప్రదేశ్​ ఉంది. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్​, తొమ్మిదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.