
కేరళ, విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా మారుతుంది. తొలి మూడు రోజుల ఆట ముగిసే సరికీ ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ మాత్రమే ఆడాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ 342 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో విదర్భకు 37 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 3 వికెట్ల నష్టానికి 131 పరుగుల వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన కేరళ.. ఓవర్ నైట్ స్కోర్ కు మరో 211 పరుగులు జోడించి చివరి 7 వికెట్లను కోల్పోయింది.
సచిన్ బేబీ 98 పరుగులు వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆదిత్య సర్వాటే 79 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 123.1 ఓవర్లలో 379 రన్స్‌కు ఆలౌటైంది. డానిష్ మాలేవర్ (153) కెరీర్ బెస్ట్ స్కోరు సాధించగా, నచికేత్ భూటే (32), యష్ ఠాకూర్ (25), అక్షయ్ వాడ్కర్ (23)ఫర్వాలేదనిపించారు. అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. నిదీశ్, ఆపిల్ టామ్ చెరో మూడు, బాసిల్ రెండు వికెట్లు పడగొట్టారు.
ALSO READ : Mitchell Starc: ఆ ఒక్క కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నా: మిచెల్ స్టార్క్
మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇరు జట్లు రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మ్యాచ్ డ్రా గా ముగిస్తే రంజీ ట్రోఫీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. దీని ప్రకారం తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగుల ఆధిక్యం సాధించిన విదర్భ విజేతగా నిలుస్తుంది. కేరళ టైటిల్ గెలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.