కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో, కురుంబాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని ఆర్మీ రక్షించింది. రెండు రోజుల పాటు కొండ చీలికల మధ్య చిక్కుకున్న 23 ఏళ్ల బాబు అనే యువకుడిని రక్షించేందుకు బుధవారం ఉదయం ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. 43 గంటలుగా బాబు ఆ కొండ చీలికలోనే ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ఆ కొండను దిగే సమయంలో అలసిపోయి కాలుజారి పడ్డాడు. అయితే కిందపడే క్రమంలో అతను ఆ కొండల్లో ఉన్న చీలిక ప్రదేశంలో చిక్కుకున్నాడు. అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా.. బాబును వాళ్లు రక్షించలేకపోయారు. ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు.
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala extends his thanks to the Indian Army after being rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
— ANI (@ANI) February 9, 2022
(Video source: Indian Army) pic.twitter.com/VzFq6zSaY6
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala has now been rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
— ANI (@ANI) February 9, 2022
(Video source: Indian Army) pic.twitter.com/VD7LG3qs3s
#UPDATE | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad, Kerala has now been rescued. Teams of the Indian Army had undertaken the rescue operation. pic.twitter.com/kymVOLzPCm
— ANI (@ANI) February 9, 2022