గ్లాస్ డోర్ ఓపెన్ ఉందనుకొని గుద్దుకున్న ఓ మహిళ.. గ్లాస్ ముక్క కడుపులో గుచ్చుకొని క్షణాల్లో చనిపోయిన ఘటన కేరళలో జరిగింది. ఎర్నాకుళానికి బీనా పాల్ అనే 40 ఏళ్ల మహిళ పెరుంబవూర్ లోని ఒక బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు లోపలికి వెళ్లిన తర్వాత కారులో ఏదో మరచిపోయినట్లు గుర్తొచ్చింది. వెంటనే బీనా పాల్ కారు వద్దకు వెళ్లడానికి వేగంగా పరిగెత్తితింది. అయితే బ్యాంకు డోరు గ్లాస్ తో ఉండటం వల్ల ఆ డోర్ మూసి ఉన్నా ఓపెన్ చేసే ఉంది అనుకున్న బీనా పాల్ డోర్ కు బలంగా ఢీకొట్టింది. దాంతో గ్లాస్ డోర్ పగిలి.. ఆమె ముక్కు కూడా పగిలింది. డోరును గట్టిగా గుద్దడంతో బీనా కిందపడి తర్వాత లేచి నిల్చుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా బీనాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే గ్లాస్ ముక్క కడుపులో గుచ్చుకుందని బీనాతో పాటు మిగతావాళ్లు కూడా గమనించలేదు. బీనా లేచిన తర్వాత ఆమె కడుపులో నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో అందరూ కంగుతిన్నారు. వెంటనే ఆమెను కుర్చీలో కూర్చొబెట్టారు. వెంటనే ఒక క్లాత్ తో ఆమె కడుపుకు కట్టి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కడుపులో రక్తం ఎక్కువగా కారడం వల్ల ఆమె మృతిచెందిందని డాక్టర్లు ధృవీకరించారు.
‘బీనా పాల్ అనే మహిళ చూసుకోకుండా గ్లాస్ డోరును గుద్దుకోవడం వల్ల గ్లాస్ ఆమె కడుపులో గుచ్చుకొని చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని పెరుంబవూర్ పోలీస్ అధికారి జయకుమార్ తెలిపారు.
For More News..