రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఓపెనింగ్స్ కి వెళ్ళటం మాములే.. షాపింగ్ కాంప్లెక్స్ లు, కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, రోడ్లు, వగైరా ప్రముఖులు ప్రారంభించటం తరచూ చూస్తుంటాం. కానీ.. కేరళలో జరిగిన ఈ ఓపెనింగ్ చుస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. కేరళలోని కొచ్చిలో పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రోడ్డుపై యూటర్న్ ను ప్రారంభించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొనటం విశేషం.
Can you believe it :
— Rishi Bagree (@rishibagree) November 3, 2024
Kerala’s industry minister, inaugurating a new U-turn in Kochi
pic.twitter.com/V2VNsbHlKf
ప్రపంచంలోనే ఇంత క్రేజీ ఓపెనింగ్ ఎక్కడా ఉండదంటూ కామెంట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. సారూ.. మీరు గ్రేట్, ఫ్యూచర్లో జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లకు కూడా ఇలాగే రిబ్బన్ కటింగ్ చేస్తారేమో అంటూ ఇంకొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, ఏ చిన్న విషయానికైనా క్రెడిట్ కొట్టేయడంలో పొలిటీషియన్స్ ముందుంటారని ఈ వీడియోతో మరోసారి ప్రూవ్ అయ్యింది.