కారు ఉంది కదా అని ఓ ప్రబుద్దుడు ఎంతో జాలీగా రోడ్డుపై వెళుతున్నాడు. వెనుక ఏ వాహనం వస్తుంది.. అది ఎలాంటిది.. అందులో ఎవరుంటారు.. అనేది గమనించకుండా ఎంజాయి చేస్తూ వెనుక ఉన్న వాహనాన్ని దారిఇవ్వకుండా రయ్‌మని పోతున్నాడు. ఇక అంతే ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆ కారు యజమానికి షాక్ ఇచ్చారు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళలో ఓ కారు ఓనర్‌కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వనందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాతో పాటు అతని లైసెన్స్‌ను రద్దు చేశారు. వైద్యపరంగా ట్రీట్మెంట్ అత్యవసరమయితే అంబులెన్స్ ల ద్వారా పేషంట్లను ఆస్పత్రికి తరలిస్తారు. జనాల ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లకు ట్రాఫిక్ రూల్స్ ఉండవు. ముందు.. వెనుకా ఎలాంటి వాహనాలు ఉన్నా .. అంబులెన్స్ వస్తుందంటే దారి ఇస్తారు.
కాని ఈ వీడియోలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే ఎదురుగా వెళ్తున్న ఓ కారు .. అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వలేదు. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. కాని అదేమీ ఆ డ్రైవర్ చెవికి ఎక్కినట్టు లేదు. అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతి సియాజ్ కారు యజమాని మాత్రం దారి ఇవ్వలేదు. ఈ ఘటనను అంబులెన్స్ లో ముందు కూర్చున్న వ్యక్తి వీడియో రికార్డ్‌చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ... పోలీసులు స్పందించారు. కారు యజమాని ఇంటికి వెళ్లి.. రూ 2.5 లక్షలు ఫైన్‌తో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు సమాచారం అందుతోంది.
A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn
— MDApp (@MDAppMDApp) November 17, 2024