టెక్నాలజీ దూసుకుపోతుంది...పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ

టెక్నాలజీ దూసుకుపోతుంది...పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.. రోబో తో హోటల్స్​ లో వర్క్​ చేయించుకోవడం... ఏఐ టెక్నాలజీ వచ్చిన..  ఇంకా పాపులర్​ అయింది. ఏఐతో కార్యాలయాల్లో పని చేయించుకోవడం.. న్యూస్​ ఛానల్స్​ లో ఏఐ యాంకర్​ లు అవతరించారు.  ఇప్పుడు తాజాగా ఓ స్కూల్లో ఏఐ టీచర్​ కూడా వచ్చేసింది.

టెక్నాలజీ దూసుకుపోతుంది.  ఆర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్​ (AI) టెక్నాలజీ అతి కొద్ది కాలంలోనే పాపులర్​ అయింది. ఈ టెక్నాలజీతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు.  కొంతమంది దీంతో అద్భుతాలు సృష్టిస్తుంటే... మరికొంతమంది మిస్​ యూజ్​ చేస్తున్నారు.  మరీ ముఖ్యంగా సెలబ్రెటీల ఫేస్​ లుమార్ఫింగ్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తుండగా.. కొన్ని కంపెనీల్లో AI ఉద్యోగస్తులు పని చేస్తున్నారు.  నిన్న మొన్నటి దాకా కంపెనీలకు పరిమితమైన AI ఇప్పుడు స్కూళ్లకు పాకింది. 

తాజాగా కేరళలో ఓ స్కూల్లో AI టీచర్​ ప్రత్యక్షమైంది.  తిరువనంతపురంలోని ఓ స్కూల్లో AI టీచర్​ లెసన్స్​ చెబుతుంది.  అచ్చం భారతీయ పంతులమ్మ వేషంలో  అందనికి ఆకట్టుకుంది.  సాధారణంగా మామూలు టీచర్​ అయితే ఓ 50 మందికో లేక 70 మందికో పాఠాలు చెబుతారు.  కాని AI టీచరమ్మ ఏకంగా 3 వేల మంది పిల్లలకు పాఠాలు చెబుతూ.. పిల్లలకు అర్దం కాని  విషయాలను పదే పదే చెప్పడమే కాకుండా.. స్టూడెంట్స్​ కు వచ్చిన డౌట్లను కూడా నివృత్తి చేస్తుంది.    మూడు భాషల్లో  పాఠాలు చెబుతున్న AI టీచరమ్మను కొచ్చికి  చెందిన  ఓ స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ  టెక్​  పంతులమ్మ ఆటోమేటెడ్‌ టీచింగ్‌ టూల్స్‌ కంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంది. 

ALSO READ :- IPL 2024: యార్కర్ల కింగ్ వచ్చేశాడు.. సన్‌రైజర్స్ క్యాంప్‌లో నటరాజన్


కేరళలో పాఠాలు చెబుతున్న AI టీచర్​  ఆడవాళ్లు ఎలా మాట్లాడుతారో అలానే మాట్లాడుతుంది.  సాధారణ టీచర్లు పాఠాలు చెప్పిన  విధంగానే చెబుతూ... అందరికి అర్దమయ్యే రీతిలో చెబుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ మేకర్స్‌ ల్యాబ్‌ సీఈవో హరిసాగర్‌ తెలిపారు.  విద్యార్థులు తమ ల్యాబ్‌ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృఈ టీచర్ పాఠాలు అందరికీ అర్థమైనట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆయన అన్నారు.. మున్ముందు మరికొన్ని స్కూల్స్ లలో ఈ ఏఐ టీచర్స్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు చెప్పారు..