WI vs SA 2024: దక్షిణాఫ్రికా స్పిన్నర్ సంచలనం.. వరుసగా 66 ఓవర్ల స్పెల్

WI vs SA 2024: దక్షిణాఫ్రికా స్పిన్నర్ సంచలనం.. వరుసగా 66 ఓవర్ల స్పెల్

టెస్ట్ క్రికెట్ లో సుదీర్ఘ స్పెల్స్ వేయడం కామన్. కానీ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన బౌలింగ్ తో షాక్ కు గురి చేశాడు. ఇటీవలే ముగిసిన తొలి టెస్ట్ లో కేశవ్ మహారాజ్ వరుసగా 66.2 ఓవర్లు వేసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 8 వికెట్లు తీసుకున్న ఈ స్పిన్నర్ తొలి ఇన్నింగ్స్ లో 40 ఓవర్లు.. రెండో ఇన్నింగ్స్ లో 26 ఓవర్లు బౌలింగ్ వేశాడు. 

తొలి ఇన్నింగ్స్ లో వరుసగా 40 ఓవర్లు వేసిన మహరాజ్.. రెండో ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ నుంచే కొత్త బంతితో బౌలింగ్ కొనసాగించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో మొత్తం 66.2 ఓవర్లు బౌల్ చేసి 8 వికెట్లు పడగొట్టాడు. 1990లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు నరేంద్ర హిర్వానీ పేరిట వరుసగా అత్యధిక ఓవర్లు వేసిన రికార్డ్ ఉంది. అతను వరుసగా 59 ఓవర్లు బౌలింగ్ చేసి టెస్ట్ క్రికెట్ లో సుదీర్ఘ స్పెల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (86) హాఫ్ సెంచరీతో 357 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 233 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 3 వికెట్లను 173 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 298 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.