కేకే, విజయలక్ష్మీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: కే.విప్లవ్ కుమార్

కేకే, విజయలక్ష్మీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: కే.విప్లవ్ కుమార్

కొన్ని రోజులుగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఆమె తండ్రి కేకే పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై ఆ రోజు కే.కేశవ్ రావు  కేసీఆర్ తో బేటీ కానున్నారు. ఈనేపథ్యంలో తండ్రి, సోదరి పార్టీ మారే విషయంపై కేశవరావు కుమారుడు కే.విప్లవ్ కుమార్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. గద్వాల విజయలక్ష్మీ, తన తండ్రి కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలతో తనకేమి సంబంధం లేదని విప్లవ్ రావు అన్నారు.

వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్వయంగా ప్రకటించాకే ఈ విషయంపై తాను ఇంకా స్పష్టంగా మాట్లాడగలనని అన్నారు. పార్టీ మారే నిర్ణయం వారి ఇష్టమని దాంతో తనకేం సంబంధం లేదని, తాను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ నాకు గట్టి నమ్మకముందని, ఆయన నాయకత్వంలోనే తాను ఉంటానని విప్లవ్ రావు స్పష్టం చేశారు.