రాజకీయాలకు కేశినేని నాని గుడ్​ బై

విజయవాడ మాజీ ఎంపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు  ట్విట్టర్​ ఎక్స్​ లో  ప్రకటించారు. రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.విజయవాడ అభివృద్దికి ఎంతో కృషి చేశానన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా విజయవాడను అభివృద్ది చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా  ఉంటానన్నారు.

2024లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే గతంలో విజయవాడ చరిత్రను పరిశీలిస్తే.. ఎంపీ గా ఓడిపోయిన నేతలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

  • 2014లో ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్​ రాజకీయాలకు దూరం
  • 2019లో ఓడిపోయిన పీవీపీ రాజకీయాల్లో కనిపించలేదు
  • 2024లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం
  • అయితే వీళ్ల కంటే ముందుగానే లగడపాటి రాజగోపాల్​ రాజకీయాలకు స్వస్థి చెప్పారు.