ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడడం కార్యకర్తలను కలవరానికి గురిచేస్తుంది. ఇప్పుడు మరో నేత రాజీనామా చేయడంతో విజయవాడ టీడీపీ నేతలు టెన్షన్ కు గురవుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుతురు కేశినేని శ్వేత టీడీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉదయం పది గంటలకు మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి తన కార్పోరేటర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు నాని ఎక్స్ లో తెలిపారు.
అందరికీ నమస్కారం ??
— Kesineni Nani (@kesineni_nani) January 7, 2024
ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ
ఎంపీ కేశినేని నాని కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూతురు కూడా రాజీనామా చేయడంతో కుటుంబం సభ్యులంతా అంతా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్టైంది. వీరిద్దరు ఏ పార్టీలో చేరతనేది స్పష్టం చేయాల్సి ఉంది.