వెళ్లొస్తాం..నాగోబా.. నిన్నటితో ముగిసిన జాతర

ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర మంగళవారం ముగిసింది. ఈనెల 9న మహాపూజలతో మొదలై 5 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన కేస్లాపూర్‌ నాగోబా జాతరకు చివరి రోజు భక్తులు పోటెత్తారు.

సంప్రదాయ వాయిద్యాలతో గోవాడ ముందర బేతల్‌ పూజలు చేసిన మెస్రం ఆడపడుచులు వంశ పెద్దల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. బేతల్‌ పూజల తర్వాత మెస్రం వంశీయులు నాగోబా దర్శనం చేసుకుని సంప్రదాయ పూజలు ముగించారు. అన్నీ సర్దుకొని సాయంత్రం ఎడ్లబండ్లపై తిరుగు ప్రయాణమయ్యారు.