బీఆర్ఎస్ సభను అడ్డుకుంటాం : కేతావత్ శంకర్ నాయక్

మిర్యాలగూడ, వెలుగు : బీఆర్ఎస్ బహిరంగ సభను అడ్డుకొని, కృష్ణా జలాల వివాదానికి కారణమెవరో ప్రజల ముందు నిలబబెడుతామని డీసీసీ ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఏపీ సర్కారు కృష్ణ జలాల దోపిడీ సాగించిందని.. ఇందుకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా సహకరించారని ఆరోపించారు.  శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ ఎన్ని టీఎంసీల నీటిని అదనంగా వాడుకుందో లెక్కలు చూస్తే ఆ విషయం అర్థం అవుతుందన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపీకి  కృష్ణా జలాలు అప్పగించిందంటూ కుట్రపూరితంగా  ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  కృష్ణా జలాల అంశాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెట్టి  మరోసారి సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య,  నేతలు ధీరావత్ స్కైలాబ్ నాయక్,  తలకొప్పుల సైదులు, పొదిల శ్రీనివాస్, తమ్ముడుబోయిన అర్జున్, పైడిమర్రి నరసింహ రావు,  ముదిరెడ్డి నర్సిరెడ్డి, మాలికాంత రెడ్డి, పోలగాని వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్ పాల్గొన్నారు.