జనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..

జనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు షాకుల మీద షాకులిస్తూ పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను పార్టీని వీడి జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో కీలక నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా వైసీపీని వీడి జనసేనలో చేరనున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చారు కేతిరెడ్డి.

ఏపీలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నంతకాలం జగన్ తోనే తన పయనమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కేతిరెడ్డి జనసేనలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం. దీంతో పాటు ప్రస్తుతం ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన తిరుమల లడ్డూ వివాదంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత జగన్ తప్పు చేయడు, చేయనివ్వడని అన్నారు.

Also Read :- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చంద్రబాబు వైసీపీపై బురదచల్లటం ఇది కొత్తేమి కాదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీపై నిందలు మోపుతూనే ఉన్నారని మండిపడ్డారు. వైసీపీ బతుకంతా చంద్రబాబు చల్లిన బురద కడుక్కోవటానికే సరిపోతుందని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారానికి జగన్ చెక్ చెప్పాలని, తిరుమల లడ్డూ వివాదంపై గట్టి కౌంటర్ ఇవ్వాలని కోరారు కేతిరెడ్డి.