కారణాలు అక్కర్లేదు.. పవన్ ఉన్నారుగా!: కేతికా శర్మ

‘సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న ‘మార్క్’  పాత్రకి ప్రేయసిగా కనిపిస్తా. సినిమాకెంతో ముఖ్యమైన, నటనకు ప్రాధాన్యత గల పాత్ర. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ కథను నడిపించేలా ఉంటుంది. అసవసరమైన సీన్స్, క్యారెక్టర్స్ ఉండవు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంటుంది. ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి చిత్రంలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. నేను నటిగా షైన్ అవడానికి చాలా హెల్ప్ అయింది. దీని ఒరిజినల్ వెర్షన్ చూశాను కానీ.. ఇందులో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. 

ALSO READ :రైల్వే భద్రతపై నిరంతర.. పర్యవేక్షణ ఉండాలి: సౌత్​ సెంట్రల్ రైల్వే జీఎం ​

ఈ సినిమా ఒప్పుకోడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు... పవన్‌‌‌‌ కళ్యాణ్ గారు అనే పేరు వింటే చాలు. ఆయన కాంబినేషన్‌‌‌‌లో నాకు సీన్స్ లేవు. కానీ ఒకరోజు సెట్‌‌‌‌లో తేజ్ పరిచయం చేశాడు. ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక డైరెక్టర్ సముద్రఖని గారికి క్లారిటీ ఎక్కువ. తక్కువ టేక్స్‌‌‌‌లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. త్రివిక్రమ్ గారి రైటింగ్ కూడా దీనికి తోడైంది. పీపుల్ మీడియా సంస్థలో చాలా కంఫర్టబుల్‌‌‌‌గా పనిచేయగలిగాను. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇక ప్రస్తుతం ఆహా స్టూడియోస్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా ప్రముఖుల బయోపిక్‌‌‌‌లో నటించాలని ఉంది’