AdhiDhaSurprisu: కేతిక అదిదా సర్‌‌‌‌ప్రైజు.. హీటేక్కించేస్తోన్న శేఖర్ మాస్టర్ స్పెషల్ సాంగ్ స్టెప్పులు

AdhiDhaSurprisu: కేతిక అదిదా సర్‌‌‌‌ప్రైజు.. హీటేక్కించేస్తోన్న శేఖర్ మాస్టర్ స్పెషల్ సాంగ్ స్టెప్పులు

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం 'రాబిన్‌‌‌‌ హుడ్‌‌‌‌’. లేటెస్ట్గా (మార్చి 10న) ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ ‘అది దా సర్‌‌‌‌ప్రైజు’ (Adhi Dha Surprisu) ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

కేతిక శర్మ  గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది. బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌‌లతో ఆమె ఈ సాంగ్‌‌లో అదరగొడుతుంది. డ్యాన్స్ మూమెంట్స్తో కిక్ ఇచ్చేస్తుంది. ఈ గ్లామర్ పాటను జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ విజె నృత్యాలు సమకూర్చారు.

ALSO READ | Srikanth Odela: నిర్మాతగా దసరా డైరెక్టర్ కొత్త ప్రయోగం.. నిజమైన కథగా గోదావరిఖని అమ్మాయి లవ్ స్టోరీ!

దాచిన నోట్లు రద్దయిపోతే.. కొట్టిన లాటరీ ఎక్సపయిరయితే.. ఆపిల్ ఫోన్కు ఆపిల్ కాస్తే.. కుండ బిర్యానీలో కుండే బాగుంటె.. అదిదా సర్ప్రయిజు అంటూ హీటేక్కించేస్తోంది పాట. ఆలస్యం ఎందుకు ఓ లుక్కేస్తూ.. కిక్కిక్కే సాంగ్ వినండి.

ఇకపోతే, శ్రీలీల హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో  రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మార్చి 28న సినిమా విడుదల కానుంది.