
గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కేతిక శర్మ (Ketika Sharma).. ఇప్పుడొక స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల రూపొందించిన ‘రాబిన్ హుడ్’ చిత్రంలో కేతిక స్పెషల్ సాంగ్‌లో నటించింది.
‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఈ హాటెస్ట్ సాంగ్‌లో ఆమె అల్ట్రా గ్లామరస్‌గా కనిపించనుందని, మార్చి 10న ఈ పాట విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కేతిక శర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది.బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌లతో ఆమె ఈ సాంగ్‌లో అదరగొట్టబోతోందని మేకర్స్ చెప్పారు.
శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మార్చి 28న సినిమా విడుదల కానుంది.
The sizzling @TheKetikaSharma will bring the hottest surprise to you all 🌟🔥 #Robinhood third single #AdhiDhaSurprisu out on March 10th ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2025
A @gvprakash musical.
Lyrics by Academy Award Winner @boselyricist
Choreography by @OfficialSekhar#Robinhood IN CINEMAS WORLDWIDE ON… pic.twitter.com/Q5WQ5eVtu7