హాట్ బ్యూటీతో అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్న రాబిన్హుడ్ టీమ్..

హాట్ బ్యూటీతో అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్న రాబిన్హుడ్ టీమ్..

రొమాంటిక్ సినిమాతో 2021లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తార కేతిక శర్మ. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలో నటించిందీ భామ. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. రెండేళ్ల క్రితం బ్రో సినిమాలో అలా మెరిసిన కెతిక ఆ తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు. నితిన్ లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్ లో అమ్మడు స్పెషల్ సాంగ్ ఛాన్స్ పట్టేసింది. నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో అదిదా సర్ప్రైజు అనే స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతుందట కెతిక శర్మ. కచ్చితంగా ఈ సాంగ్ తర్వాత కేతిక గురించి అందరు మాట్లాడుకుంటారని అంటున్నారు. సినిమాలో కరెక్ట్ టైం కి కేతిక స్పెషల్ సాంగ్ ప్లేస్ చేస్తున్నారట. ఈ సాంగ్ వల్ల ఆమెకు.. అమ్మడి వల్ల సినిమాకు కూడా హెల్ప్ అయ్యేలా సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి కేతిక నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షోచేసేసిందని అంటున్నారు. అదే నిజమై ఈ సాంగ్ క్లిక్ అయితే కేతికకు చాన్సులు క్యూ కట్టే అవకాశం ఉంది.

ALSO READ | బ్రెయిన్ ట్యూమర్ తో చెల్లెలు మృతి.. చిరు లైఫ్ లో ఇంత విషాదం దాగుందా..?

ఈ విషయం ఇలా ఉండగా నటి కేతిక శర్మ యోంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ లో నటించాడని కూడా ఒకే చెబుతోంది. ఇటీవలే తమిళ్ ప్రముఖ డైరెక్టర్ రాజేష్ ఎమ్ సెల్వన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఆఫర్  దక్కించుకున్నట్లు సమాచారం.