Champions Trophy: వదలని శని దేవుడు.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అఫీషియల్స్ వీరే

Champions Trophy: వదలని శని దేవుడు.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అఫీషియల్స్ వీరే

ఫిబ్రవరి 19 నుండి ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)  మ్యాచ్ అఫీషియల్స్ జాబితాను వెల్లడించింది. 8 జట్లు తలపడే ఈ టోర్నీలో 12 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరిలో భారత జట్టుకు శనిలా పట్టిన రిచర్డ్ కెటిల్‌ బరో కూడా ఉన్నారు. 

అంపైర్లు: కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గౌఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సాన్ రజా, పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్.

మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్.

శని దేవుడిగా ప్రసిద్ధి..!

రిచర్డ్ కెటిల్‌ బరో.. ఈ పేరు వింటేనే భారత అభిమానులకు ఎక్కడలేని భయం. అతను అంపైర్‌గా వ్యవహరించిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడటమే అందుకు ప్రధాన కారణం. 

ALSO READ | Champions Trophy: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవాలి.. పాక్ అభిమాని శాపనార్ధాలు

టీ20 వరల్డ్ కప్ 2014 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన భారత జట్టు.. అనంతరం ప్రపంచ కప్ 2015 సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో, టీ20 ప్రపంచ కప్ 2016 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. అంతేకాదు, 2023లో అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లోనూ ఓడింది. ఈ మ్యాచ్లన్నింటికీ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నారు. 

మరి గతేడాది టీ20 ప్రపంచ కప్ అంటారా..! ఈ మ్యాచ్‌లో అతను టీవీ అంపైర్. బహుశా.. అందువల్లేనేమో టీమిండియా విజేతగా నిలవగలిగింది.