మెదక్, వెలుగు : ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుని కొలుస్తారనడానికి నిదర్శనమే కేవల్ కిషన్ అని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. గురువారం కేవల్ కిషన్ ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి శివారులోని ఆయన సమాధి వద్ద శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కేవల్ కిషన్ కూతురు వీణ కుమారితో కలిసి నీలం మధు పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అని కొనియాడారు. దున్నేవాడికే భూమి అంటు భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టారన్నారు. కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కుల సాధనకు కృషి చేశాడన్నారు. అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతర నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
కార్యక్రమంలో సభాధ్యక్షుడు పుట్టి అక్షయ్, మాజీ సర్పంచ్ సత్యం, స్వరూప, సత్యనారాయణ, గోపాలకృష్ణ, శ్రీకాంత్, శివన్న, బోయిని అరుణ, శివ, సంతోష్, ఎట్టయ్య, మహేశ్, శ్రీనివాస్, గంగాధర్, కృష్ణ, సత్యం, మణిదీప్, భిక్షపతి పాల్గొన్నారు.
కేవల్ కిషన్ స్ఫూర్తితో..
సంగారెడ్డి టౌన్ : కేవల్ కిషన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని, జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి కేవలం కిషన్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. గురువారం కేవల్ కిషన్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం తురకల మాందాపూర్ లో జన్మించిన కిషన్ భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు భూములు పంచిన మొదటి ఉద్యమకారుడన్నారు. కార్యక్రమంలో మల్లేశం, సాయిలు, అడివయ్యా, నర్సింలు, కృష్ణ, అశోక్, రామచంద్రమూర్తి, శివకుమార్ ఉన్నారు.