IND vs ENG: గిల్‌ను విమర్శించొద్దు..కలిస్‌లా దిగ్గజ ప్లేయర్ అవుతాడు: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్

IND vs ENG: గిల్‌ను విమర్శించొద్దు..కలిస్‌లా దిగ్గజ ప్లేయర్ అవుతాడు: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్

టీమిండియా ఆటగాడు శుభమాన్ గిల్ టెస్టుల్లో తన పేలవ ఆటను కొనసాగిస్తున్నాడు. ఫ్యూచర్ స్టార్ గా అందరి ప్రశసంలు అందుకున్న ఈ యువ కెరటం ఫామ్ భారత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో గిల్ వరుసగా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 23 పరుగులు, తాజాగా వైజాగ్ లో జరుగుతున్న టెస్టులో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.
 
రెండో ఇన్నింగ్స్ లో గిల్ నిరూపించుకోవడానికి చివరి అవకాశమని.. ఈ టెస్టు తర్వాత అతన్ని తప్పించాలని ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. సీనియర్ ప్లేయర్ పుజారాను జట్టులోకి తీసుకోరావాలని డిమాండ్ చేస్తున్నారు. చివరి 7 టెస్టుల్లో కేవలం 207 పరుగులు మాత్రమే చేసిన గిల్ యావరేజ్ 18.81. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ గిల్ కు మద్దతుగా నిలిచాడు. గిల్ వరుసగా విఫలమవుతున్న అతడిని జట్టులో కొనసాగించాలని ఈ ఇంగ్లీష్ మాజీ స్టార్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ కలిస్ తో పోల్చాడు.
 
కల్లిస్ టెస్టు కెరీర్ చూసుకుంటే తొలి 10 టెస్టుల్లో యావరేజ్ 22 మాత్రమే ఉంది. ఆ తర్వాత గొప్పగా ఆడి టాప్ ప్లేయర్ గా నిలిచాడు.గిల్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. అతనొక సీరియస్ ప్లేయర్. జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకముంచాలి. అని పీటర్సన్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. తొలి టెస్టులో విఫలమైన గిల్ కు వైజాగ్ టెస్టులోనూ అవకాశం లభించింది. మూడో టెస్ట్ కు  విరాట్ కోహ్లీ, రాహుల్ వస్తున్న నేపథ్యంలో గిల్ స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. మరి గిల్ వైజాగ్ లో జరగబోయే ఇన్నింగ్స్ లో ఎలా ఆడతాడో చూడాలి.