DC vs RCB: ఎవరి స్థానంలో ఆడించాలో మీరే చెప్పండి.. రూ.10 కోట్ల బౌలర్‌పై పీటర్సన్ హాట్ కామెంట్స్

DC vs RCB: ఎవరి స్థానంలో ఆడించాలో మీరే చెప్పండి.. రూ.10 కోట్ల బౌలర్‌పై పీటర్సన్ హాట్ కామెంట్స్

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. ఢిల్లీ ఈ సీజన్ లో 9 మ్యాచ్ లాడినా ఈ తమిళ నాడు పేసర్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ప్లేయింగ్ 11 లో అవకాశం ఇవ్వలేదు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో నటరాజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున ఆడిన నట్టూ.. ఏ ఈ సారి క్యాపిటల్స్ కు వెళ్లడంతో ఆ ఆజట్టు బౌలింగ్ దుర్బేధ్యంగా మారింది అనుకున్నారు. కానీ కట్ చేస్తే అసలు నటరాజన్ ను ఎందుకు కొన్నారో అర్ధం కావడం లేదు.

తొలి మ్యాచ్ లో పూర్తి ఫిట్ నెస్ సాధించలేదనే కారణంగా తుది జట్టులో స్థానం కల్పించలేదు. ఆ తర్వాత అయినా ఆడతాడనుకుంటే నిరాశే మిగిలింది. అయితే ఆదివారం (ఏప్రిల్ 27) రాయల్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత నటరాజన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నటరాజన్ ప్లేయింగ్ 11 లో పనికి రాడంటూ అన్నట్టుగా మాట్లాడాడు. పీటర్సన్ మాట్లాడుతూ.. "నటరాజన్ జట్టు కోసం ఎప్పుడైనా ఆడడానికి సిద్ధమే. కానీ దురదృష్టవ శాత్తు అతను 12 మంది ఆటగాళ్లలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. నటరాజన్ ను ఎవరి స్థానంలో ఆడించాలో మీరే చెప్పండి". అని పీటర్సన్ అన్నాడు.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్, చమీర లాంటి ఫారెన్ ఫాస్ట్ బౌలర్లతో పాటు.. టీమిండియా పేసర్ ముకేశ్ చౌదరీ జట్టులో ఉన్నారు. ఢిల్లీ తమ ప్రారంభ మ్యాచ్ ల్లో మోహిత్ శర్మకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది. అతను పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో మోహిత్ స్థానంలో నటరాజన్ కు ఛాన్స్ ఇవ్వకుండా చమీరను తుది జట్టులో తీసుకొచ్చారు. తొలి నాలుగు మ్యాచ్ లు వరుసగా గెలిచిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ ల్లో రెండే గెలిచింది. నటరాజన్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఢిల్లీ జట్టులో ఉంటే జట్టు బలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చమీరాను పక్కన పెట్టి నటరాజన్ కు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.