
- బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా పొలిటికల్ సర్వే
- లీడర్లు, వ్యాపారవేత్తల నంబర్లు ప్రణీత్‌రావు టీమ్‌కు చేరవేత
- నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అంగీకారం
- 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు..వచ్చే నెల 2న మళ్లీ రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసులో ఆదోనిందితుడిగా ఉన్న శ్రవణ్ పు అప్రూవర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శనివారం ఆయన సిట్ విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. నాడు జీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పినట్టు సమాచారం నాడు ప్రభుత్వ ప్రత్యర్థులే టార్గెట్గా పొ -లిటికల్ సర్వే నిర్వహించామని అందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నేతల ఆర్థిక వనరుల వివరాలు సేకరిం చామని అది అప్పటి ఎన్ఐటీ స్పెషల్ ఆపరేషన్స్ చీఫ్ ప్రత్అవుకు అందించామని సెట్ ఎదుట శ్రవణ్ రావు. వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.
శ్రవణ్‌రావును విచారించాలని, కానీ అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఈ నెల 24న సిట్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌రావు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో నలుగురు సభ్యుల స్పెషల్ టీమ్ ఆయనను విచారించింది. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 7గంటల పాటు ప్రశ్నించింది. కొన్ని డాక్యుమెంట్లతో ఏప్రిల్ 2న మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వాట్సాప్ మెసేజ్‌లతో గుట్టురట్టు..
స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో శ్రవణ్‌రావును సిట్ అధికారులు విచారించారు. అదంతా వీడియో రికార్డింగ్ చేశారు. ఈ కేసులో రెండో నిందితుడైన ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రశ్నించారు. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావుతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారించారు. ఎస్‌ఐబీ లాగర్ రూమ్ హార్డ్‌డిస్క్‌ల నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లు, ప్రణీత్‌రావుకు శ్రవణ్‌రావు అందించిన ఫోన్ నెంబర్లను ముందుంచి ప్రశ్నించారు. ప్రధానంగా ప్రభాకర్ రావు టీమ్‌కు ఎంత మంది ఫోన్ నెంబర్లు అందించారనే వివరాలను శ్రవణ్‌రావు నుంచి సిట్ అధికారులు రాబట్టినట్టు తెలిసింది.
దీనికి ఆయన ఫోన్ నెంబర్ నుంచి ప్రణీత్‌రావు టీమ్‌కు వెళ్లిన వాట్సాప్ మెసేజ్‌లను ఆధారాలుగా చూపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్‌కు ఎవరు ప్రేరేపించారు? ఎస్‌ఐబీకి ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అని సిట్ ప్రశ్నించగా.. అప్పటి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు తాము నిర్వహించిన పొలిటికల్ సర్వే సమాచారం అడిగితే ఇచ్చినట్టు శ్రవణ్‌రావు చెప్పారని తెలిసింది. అలాగే ఇద్దరు మాజీ మంత్రులతో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వారి వల్ల ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరిందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్టు సమాచారం.
శ్రవణ్‌రావు జర్నీ సాగిందిలా..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ పోలీసులు ఈ నెల 26న శ్రవణ్‌రావు కుటుంబసభ్యులకు నోటీసులు అందించారు. దీంతో ఆయన రెండ్రోజుల కింద అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు బయలుదేరారు. శనివారం సిట్ విచారణకు హాజరవుతానని తన కుటుంబసభ్యుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అయితే శ్రవణ్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ ఉండడంతో దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు.
దీనిపై సీబీఐ ఇంటర్‌పోల్ వింగ్‌కు సమాచారం అందించారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ గురించి సీబీఐ చెప్పడంతో అక్కడి అధికారులు విడిచిపెట్టారు. ఈ క్రమంలో సీబీఐ నుంచి శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులకు, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరికి సమాచారం అందింది. మొత్తానికి శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రవణ్‌రావు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
జవాబులు దాటవేసే ప్రయత్నం..
శ్రవణ్‌రావు విచారణలో వాట్సాప్ మెసేజ్‌లే కీలకంగా మారినట్టు తెలిసింది. సిట్ అడిగిన కొన్ని ప్రశ్నలకు శ్రవణ్‌రావు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ సిట్ ఇప్పటికే సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను ఆయన ముందుంచి ప్రశ్నించగా, తప్పించుకోలేకపోయినట్టు సమాచారం. ప్రధానంగా 2023 ఎలక్షన్లతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ ఆధ్వర్యంలో రాజకీయ, వ్యాపారవేత్తల డబ్బు తరలింపుపై ఎలాంటి నిఘా పెట్టారనే కీలక సమాచారం సిట్ సేకరించింది.
జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లు, దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ఎలా ట్యాప్ చేశారనే వివరాలను శ్రవణ్‌రావు వెల్లడించినట్టు తెలిసింది. ప్రధానంగా శ్రవణ్‌రావు అందించిన ఫోన్ నెంబర్లను ప్రణీత్‌రావు టీమ్ ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. ఖమ్మం నియోజకవర్గంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారం కూడా శ్రవణ్‌రావు పంపించినట్టు ఆధారాలు సేకరించింది.
లీడర్లు, వ్యాపారవేత్తలే టార్గెట్‌గా ట్యాపింగ్..
శ్రవణ్‌రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ప్రణీత్‌రావు ట్యాప్ చేసేవారు. వాళ్లు డబ్బు తరలిస్తున్న సమయంలో అప్పటి పొలిటికల్ వింగ్ మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు సమాచారం అందించేవారు. మునుగోడు బైఎలక్షన్ల సమయంలో ఇలాగే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల డబ్బు మాత్రమే పట్టుపడడానికి గల కారణాలను శ్రవణ్‌రావు సిట్ ముందు వెల్లడించినట్టు సమాచారం.
పొలిటికల్ లీడర్లతో పాటు హైదరాబాద్, బెంగళూర్, ఏపీలోని ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ప్రణీత్‌రావుకు ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. బెంగళూర్ నుంచి డబ్బు ట్రాన్స్‌పోర్ట్ అవుతున్నట్టు ప్రణీత్‌రావుకు పంపిన మెసేజ్‌లపై కూడా వివరాలు సేకరించినట్టు తెలిసింది. అలాగే దర్యాప్తుకు సహకరించకుండా అమెరికాకు పారిపోవడానికి గల కారణాలపైనా ఆరా తీసినట్టు సమాచారం.