ఏపీ సర్కార్, గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం

ఏపీ సర్కార్, గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రజా సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు ఎంవోయూపై సంతకాలు చేసినట్లు బుధవారం (మార్చి 19) ఇరువర్గాలు ప్రకటించాయి. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో ఖర్చు-సమర్థవంతమైన మరియు స్కేలబుల్ పరిష్కారాలను సమగ్రపరచడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యమని వెల్లడించాయి.

కాగా, ఏపీకి పెట్టుబడుల కోసం ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ మెక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‎తో చంద్రబాబు భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బుధవారం (మార్చి 19) సమావేశమైన వీరిద్దరూ ఏపీలో పెట్టుబడి అంశాలపై చర్చించారు. 

ALSO READ | విశాఖ ప్లాంట్‎పై మోడీది ‘సైలెంట్ కిల్లింగ్’ ఫార్ములా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన YS షర్మిల

ఏపీలో ఉన్న అవకాశాలను వివరించిన చంద్రబాబు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని బిల్ గేట్స్‎ను కోరారు. బిల్ గేట్స్ సముఖత వ్యక్తం చేయడంతో గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీకి సహకారం అందించడానికి గేట్స్ ఫౌండేషన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.