స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు... నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా రేవంత్​ సర్కార్​ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం శనివారం ( మార్చి 9)న  మరో గ్రూప్​తో కీలక ఒప్పందం చేసుకుంది. టాటా గ్రూప్​ కంపెనీ ప్రతినిథులతో  తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు.    రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అప్ గ్రేడ్ చేయనుంది.ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 

ALSO READ :-భారత్ మమ్మల్ని క్షమించాలి: మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు

2024–25 విద్యాసంవత్సరం నుంచి ఈ ప్రాజెక్ట్​ ను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుపుతుంది.  ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నాలజీస్ అందిచనుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలోనే టాటా కంపెనీకి ప్రభుత్వానికి మధ్య కుదిరింది.