మాస్కో: ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించగలవని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించిన మొదటి వారంలోనే ఇస్తాంబుల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందని.. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఒప్పందం అమల్లోకి రాలేదని పుతిన్ వెల్లడించారు.
భారత ప్రధాని మోదీ ఇటీవలే రష్యా, ఉక్రెయిన్‌లో ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా స్నేహితులు, భాగస్వాములను మేము గౌరవిస్తాం. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితిని వారు పరిష్కరించాలనుకుంటున్నారు. ముఖ్యంగా చైనా, బ్రెజిల్, ఇండియా దేశాలు రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నాయి” అని పుతిన్ తెలిపారు.