2027లో చంద్రయాన్-4: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్

2027లో చంద్రయాన్-4: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ: వచ్చే రెండేండ్లలో భారత్ 3 ప్రతిష్టాత్మక మిషన్లను చేపడుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2027లో చంద్రయాన్- 4 మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించనుందని, 2026లో గగన్​యాన్, సముద్రయాన్ మిషన్లను ప్రారంభిస్తుందని గురువారం మీడియాకు చెప్పారు. "చంద్రుని ఉపరితలంలో రాళ్ల నమూనాలను సేకరించి వాటిని తిరిగి భూమికి తీసుకురావడమే చంద్రయాన్-4 మిషన్ లక్ష్యం" అని మంత్రి తెలిపారు. 

అలాగే, వచ్చే ఏడాది గగన్​యాన్ మిషన్‎ను కూడా లాంచ్​చేయనున్నట్లు తెలిపారు. ఈ మిషన్‎లో భారతీయ వ్యోమగాములను అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్యకు పంపి.. సురక్షితంగా తిరిగి తీసుకురావడం వంటివి ఉంటాయని చెప్పారు. దీంతో పాటు సముద్రయాన్ మిషన్‎ను కూడా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో సముద్రగర్భాన్ని అన్వేషించడానికి ముగ్గురు శాస్త్రవేత్తలు సబ్​మెరైన్‎లో 6 వేల మీటర్ల లోతుకు వెళ్తారని వెల్లడించారు.