భూభారతి రూల్స్ రిలీజ్.. భూధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జారీ ఇలా..

భూభారతి రూల్స్ రిలీజ్.. భూధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జారీ ఇలా..

భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్‌‌‌‌ను ప్రభుత్వం రిలీజ్​చేసింది. భూసమస్యలకు ఎక్కడ? ఎలా? ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు. 

ఇతర మ్యుటేషన్‌‌లు
    

  • కోర్టు ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, రెవెన్యూ కోర్టు ఆర్డర్, ప్రభుత్వ అసైన్‌‌మెంట్, భూదాన్, ఇనామ్ రద్దు, ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్, ల్యాండ్ అక్విజిషన్ కాంపెన్సేషన్ వంటి ఇతర మార్గాల ద్వారా హక్కులు పొందినవారు ఆర్‌‌డీవోకు దరఖాస్తు చేయవచ్చు. ఆధారాలతో అఫిడవిట్, సర్వే మ్యాప్ (కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి) సమర్పించాలి.
  • ఆర్‌‌డీవో నోటీసు జారీ చేసి, 7 రోజుల్లో ఆధారాలు స్వీకరిస్తారు. విచారణ తర్వాత 30 రోజుల్లో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు.
  • మ్యుటేషన్ ఆమోదమైతే, రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌లో మార్పులు చేసి పాస్‌‌బుక్ జారీ చేస్తారు.

భూధార్ కార్డు
    

  • రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌లో ఎంట్రీ ఉన్నవారికి వివాదాలు లేనట్లు నిర్ధారిస్తే తహసీల్దార్ తాత్కాలిక భూధార్ కార్డు జారీ చేస్తారు.
  • కమిషనర్ నోటిఫై చేసిన తేదీ నుంచి లైసెన్స్‌‌డ్ సర్వేయర్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌‌లతో భూమి సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రభుత్వ సర్వేయర్ దీన్ని ధ్రువీకరిస్తే, భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (భూధార్) ఇస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ భూధార్ కార్డు జారీ చేస్తారు.

పట్టాదార్ పాస్‌‌బుక్ జారీ  
    

  • పాస్‌‌బుక్ కోసం భూభారతి పోర్టల్‌‌లో తహసీల్దార్‌‌కు దరఖాస్తు చేయవచ్చు. తహసీల్దార్ రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌ను పరిశీలించి, ధ్రువీకరణ తర్వాత పాస్‌‌బుక్ జారీ చేస్తారు.
  • తహసీల్దార్ స్వయంగా కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌లో ఉన్నవారికి పాస్‌‌బుక్‌‌లు జారీ చేయవచ్చు.
  • పాస్‌‌బుక్‌‌లో తప్పులు ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ రికార్డులతో సరిపోల్చి సవరణలు చేస్తారు.

సర్టిఫైడ్ కాపీలు 
    

  • రికార్డ్ ఆఫ్ రైట్స్, ఇతర పబ్లిక్ డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీల కోసం భూభారతి పోర్టల్‌‌లో దరఖాస్తు చేయవచ్చు.
  • తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కాపీలను జారీ చేస్తారు. ఇవి ఇండియన్​ఎవిడెన్స్​యాక్ట్​-2023, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 ప్రకారం చెల్లుతాయి.