కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక అంశాలు ఇవే

కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో కీలక అంశాలు ఇవే

హైదరాబాద్ జల సౌథలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది... మంగళవారం ( జనవరి 21, 2025 ) జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలిపారు అధికారులు.కృష్ణా నదీ జలాల మళ్లింపు మీద సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు అధికారులు. 66:34 వాటాలను అప్పట్లో ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని.. 71:29 వాటాలను కేటాయించాలనినేది తెలంగాణ హక్కు అని.. అప్పటివరకు నదీ జలాల వాటాలను 50:50 ఇవ్వాలని కోరినట్లు తెలిపారు అధికారులు. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు ఛైర్మెన్ ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఔట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయి తెలియాలని.. 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని తెలిపామని అన్నారు.నదీ జలాల వాటాలకు సంబంధించి ఛైర్మెన్ ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ  ఏపీ కి ఇవ్వబోమని స్పష్టం చేశామని.. శ్రీశైలం డ్యాం సేఫ్టీ గురించి చర్చించామని,శ్రీశైలం డ్యామ్ స్లూజ్ రిపేర్ గురించి అడిగినట్లు తెలిపారు అధికారులు.

దీంతో పాటు నాగార్జున సాగర్ పర్యవేక్షణ నుంచి  సీఆర్పీఎఫ్ ను విరమించుకోవాలని కోరామని.. ఇందుకు 2నెలల సమయం కోరారని... 2 నెలల తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు అధికారులు.