టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. 2023 సెప్టెంబర్ 22 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్ వెల్ మొదటి వన్డేకు దూరం అయ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
గజ్జల్లో నొప్పితో స్టార్క్, చీలమండ గాయంతో గ్లెన్ మాక్స్ వెల్ బాధపడుతున్నట్లు తెలిపారు. మిగితా రెండు వన్డేలకు వీరిద్దరూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక కమిన్స్ కూడా సుమారు పది నెలల తర్వాత వన్డేలు ఆడనున్నాడు. కాగా ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న వన్డే సిరీస్ కావడంతో ఆస్ట్రేలియా, భారత్ జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..
- మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ
- రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్
- మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్
ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
భారత జట్టు :
తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, జస్ప్రీతమ్‌మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
మూడో వన్డేకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.