ఏసీబీ చేతిలో కీలక కేసులు.. గొర్రెల స్కాం నుంచి ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌ దాకా దర్యాప్తు స్పీడప్

ఏసీబీ చేతిలో కీలక కేసులు.. గొర్రెల స్కాం నుంచి ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌ దాకా దర్యాప్తు స్పీడప్
  • 152 కేసుల్లో 223 మంది అరెస్ట్‌‌‌‌‌‌‌‌, రూ.82.78 లక్షలు సీజ్‌‌‌‌‌‌‌‌
  • రూ.97.43 కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్‌‌‌‌‌‌‌‌
  •  2024 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన డీజీ విజయ్​కుమార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: 2024లో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ శాఖల్లో లంచాలకు మరిగినవాళ్ల ఆటకట్టిస్తూనే గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన కీలకమైన కేసుల దర్యాప్తును స్పీడప్ చేసింది. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా–ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కేసుతో పాటు హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ టైన్‌‌‌‌‌‌‌‌ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివబాలకృష్ణ, గొర్రెల స్కీమ్‌‌‌‌‌‌‌‌ సహా కీలక కేసులను దర్యాప్తు చేస్తున్నది. 

ఏసీబీ ట్రాప్‌‌‌‌‌‌‌‌లో చిక్కిన ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఈ నిఖేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టింది. ఈ క్రమంలోనే గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు కేసులు నమోదు చేసింది. ఈ వివరాలను ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు 2024 వార్షిక నివేదికను పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. గతేడాది 95 కేసులు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా ఈ ఏడాది 152 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

159 మంది లంచావతారాల అరెస్ట్‌‌‌‌‌‌‌‌.. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రాజకీయ ప్రమేయం లేకపోవడంతో స్వేచ్ఛగా విధులు నిర్వర్తిస్తున్నది. ఇందులో భాగంగా 2024 సంవత్సర కాలంలో మొత్తం 152 కేసులు నమోదు చేసి 223 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో లంచం తీసుకుంటూ పట్టుబడిన129 ట్రాప్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో 159 మంది ప్రభుత్వ అధికారులు, 41 మంది ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు ఉన్నారు. లంచంగా తీసుకున్న రూ.82.78 లక్షలు సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో కోర్టు ఆదేశాలతో రూ.64.80 లక్షలను బాధితులు/ఫిర్యాదుదారులకు అప్పగించారు. 11 ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో రూ.97.43 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నిధులు దుర్వినియోగానికి సంబంధించి 12  కేసుల్లో 18 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

29 ఆకస్మిక తనిఖీలు.. 64 శాతం కన్విక్షన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌

ఆర్టీఏ సహా వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన అవినీతి ఆరోపణలతో 11 రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కేసులు నమోదు చేశారు. 29 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‌‌‌‌‌‌‌‌అవినీతి అధికారులపై ప్రభుత్వానికి రిపోర్టులు అందించారు. 2018 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 26 పాత కేసులను పరిష్కరించారు. గతంలో నమోదైన 105 కేసుల్లో సంబంధిత అధికారులను  ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆయా కేసుల్లో చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 16 కేసుల్లో కోర్టులు శిక్షలు విధించాయి. 

ఈ క్రమంలో గతంతో పోల్చితే ఈ ఏడాది 64 శాతం కన్విక్షన్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ అయ్యిందని డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. సిబ్బందితో స్కిల్స్ పెంచేందుకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామన్నారు. అవినీతి అధికారుల సమాచారం తెలిస్తే 1064 ఏసీబీ టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కాల్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు.