మ్యూచువల్ ఫండ్ రూల్స్​లో మార్పులు

మ్యూచువల్ ఫండ్ రూల్స్​లో మార్పులు
  • ఇక నుంచి ఎంఎఫ్​ లైట్​

న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ సవరణల్లో భాగంగా, కొత్త అసెట్​క్లాస్​‘స్పెషలైజ్డ్​ఇన్వెస్ట్​మెంట్​ఫండ్​’ను ప్రవేశపెట్టడంతో పాటు, పాసివ్ ఇన్వెస్ట్‌‌మెంట్లను ప్రోత్సహించే లక్ష్యంతో 'ఎంఎఫ్​ లైట్' అనే ఒక నూతన ఫ్రేమ్‌‌వర్క్‌‌ను కూడా ప్రారంభించింది.  అధిక నష్టభయం ఉన్న పెట్టుబడిదారుల కోసం కొత్త అసెట్​క్లాస్​ను ప్రవేశపెట్టింది. ఇది సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌‌ఫోలియో మేనేజ్‌‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్​) మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆస్తి కేటాయింపులో మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఆస్తి వర్గానికి కనీస పెట్టుబడి రూ.10 లక్షలు ఉంటుంది. ఎంఎఫ్​లైట్​ వల్ల నిబంధనలు మరింత సులువుగా మారుతాయి. పాసివ్ పథకాలను అందించే ఫండ్ హౌస్‌‌ల కోసం కంప్లయన్స్ భారాన్ని తగ్గించడం సాధ్యపడుతుంది. పాసివ్ ఫండ్స్​తో మార్కెట్‌‌లోకి కొత్త కంపెనీ ప్రోత్సహించవచ్చు. అన్​రిజిస్టర్డ్​,  అనధికార పెట్టుబడి పథకాల విస్తరణను తగ్గించడం సాధ్యపడుతుంది. మ్యూచువల్ ఫండ్ లైట్ అసెట్ మేనేజ్‌‌మెంట్ కంపెనీకి కనీసం రూ. 35 కోట్ల నికర ఆస్తులు ఉండాలి.