పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై ఇంటర్నల్ మార్కులు ఉండవ్.. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్

పదోతరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై ఇంటర్నల్ మార్కులు ఉండవ్.. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్

టెన్త్ పరీక్షల్లో మార్కుల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విధాన్నాన్ని ఎత్తి వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ లో ఇంటర్నల్స్ మార్కులు లేకుండా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 

2024-25 విద్యాసంవత్సరం నుంచి ఈ ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఇంటర్నల్స్ కు 20 మార్కులు, మెయిన్ ఎగ్జామ్స్ కు 80 మార్కులు ఇచ్చేవారు ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి టెన్త్ పరీక్షల్లో విద్యార్థులకు ఆన్సర్ షీట్లు బుక్ లెట్ల రూపంలో ఇవ్వనున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇస్తారు.