హైదరాబాద్: సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బావమర్ది కాదని, తన చిన్నల్లుడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ అనవసర వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనోహర్ రెడ్డి కుమారుడు సుజన్ రెడ్డి అని అన్నారు. మనోహర్ రెడ్డి తన వియ్యంకుడని చెప్పారు. సుజన్ రెడ్డికి రాజకీయాలకు లింక్ లేదన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్లో ఎంతో మంది లబ్ధి పొందారని చెప్పారు. బిజినెస్ వేరు.. రాజకీయం వేరని అన్నారు.
ALSO READ | నిర్లక్ష్యం.. సహించం.. సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తప్పడు సమాచారం ఇచ్చారని వాపోయారు. అన్ని విషయాలను కేటీఆర్‌తో కలిసి చర్చిస్తానని వివరించారు. సుజన్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆన్ లైన్ టెండర్ల ద్వారా తన కుమారుడు నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు దక్కించుకున్నారని తెలిపారు. అవసరమైతే మీడియా ముందు వివరాలు వెల్లడించేందుకు సుజన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నారని తెలిపారు.