దానవీరశూరకర్ణలో NTR నటనకు మించి చంద్రబాబు యాక్టింగ్: వైఎస్ జగన్

దానవీరశూరకర్ణలో NTR నటనకు మించి చంద్రబాబు యాక్టింగ్: వైఎస్ జగన్

ఏపీ ప్రభుత్వం 2024-2025 మిగిలిన ఆర్థిక సంవత్సరానికి  ప్రవేశపెట్టిన బడ్జెట్‎పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. 2024, నవంబర్ 13వ తేదీన తాడేపల్లిగూడెంలో జగన్ మీడియతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రవేశపెట్టింది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‎గా అభివర్ణించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టారని.. వాళ్ల మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీశారని విమర్శించారు. సాకులు చెప్తూ బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

సీఎం చంద్రబాబు మాటలు అన్ని ఉత్తి డ్రామా అని బడ్జెట్‎లో తేటతెల్లం అయిందని ఎద్దేశా చేశారు. చంద్రబాబు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్‎లా వ్యవహరిస్తున్నారని అన్నారు జగన్. ప్రభుత్వాలు అప్పులు చేయడం.. పథకాలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ మా ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే ఫేక్ ప్రచారం చేశారని సీరియస్ అయ్యారు జగన్. 

ALSO READ | రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటికొచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు

రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని ముందు చంద్రబాబు మాట్లాడుతారు.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి చంద్రబాబుకు వత్తాసు పలుకుతారని.. మొత్తం ఓ పథకం ప్రకారం ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ఎగ్గొట్టడానికి జగన్ అప్పులు చేశాడని నా పేరు చెప్పి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు. 

దానవీనశూరకర్ణలో ఎన్టీఆర్‎కు మించి చంద్రబాబు నటిస్తున్నారని జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రానికి 2019లో టీడీపీ ప్రభుత్వం నుండి దిగిపోయే నాటికి 3 లక్షల 13 వేల కోట్ల అప్పు ఉంది. 2024లో మేం దిగిపోయే నాటికి రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పు ఉంది. కానీ 10 లక్షలు కోట్లు, 14 లక్షల కోట్ల అప్పు అని మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు.. తీరా బడ్జెట్‎లో రాష్ట్ర అప్పు రూ.6లక్షల కోట్లు చూపించారని  తీవ్రస్థాయిలో మండిపడ్డారు.