అన్ని పొలిటికల్ పార్టీలు మాలలను లైట్ తీసుకున్నాయి: ఎమ్మెల్యే వివేక్

అన్ని పొలిటికల్ పార్టీలు మాలలను లైట్ తీసుకున్నాయి: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీలు మాలలను లైట్ తీస్కున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్ ఆదివారం మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, మాలల ఐక్యతకు సంబంధించిన విషయాలపై ఈ  సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. ఎస్సీల్లో 80 శాతం మేమే ఉన్నామని మాదిగలు చెప్పగలిగారు, మనం చెప్పలేకపోతున్నాం.. కానీ మాల ఉద్యోగస్తులు అందరూ మొదటిసారి ముందుకు వచ్చారని అన్నారు. 

 ఖమ్మం, జహీరాబాద్, మహబూబ్ నగర్ నుంచి చాలా మంది వచ్చారని.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరో పోరాటం చేస్తారని మీరు ఇంట్లో కూర్చోవద్దని.. ఉద్యోగులు మిగిలిన వారిని మోటివేట్ చేయాలని సూచించారు. వర్గీకరణ విషయంలో మేం అందరం పోయి ముఖ్యమంత్రిని కలిశాం.. సబ్ కమిటీ వేయొద్దు కోరాం. కానీ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో కమిటీ వేసినట్లు సీఎం చెప్పాడన్నారు. ఎమన్నా ఉంటే ఢిల్లీలో మాట్లాడమని సీఎం చెప్పారని.. నేను త్వరలోనే ఢిల్లీ పోయి ఈ విషయం గురించి అక్కడ మాట్లాడుతానని పేర్కొన్నారు. 

ALSO READ | చెన్నూరు చెరువు మత్తడి పేల్చినోళ్లను వదలం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వర్గీకరణ విషయంలో జ్యుడిషియయల్ కమిటీ వేస్తే న్యాయం జరుగుతదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాలల 30 లక్షల కంటే ఎక్కువ ఉంటారని.. కానీ ఎస్సీల్లో మాలలు తక్కువగా ఉన్నారంటూ మాదిగలు చెప్పేది కరెక్టని అందరు అనుకుంటున్నారూ.. రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్‎లోకి వెళ్తోందని అన్నారు. వర్గీకరణ విషయంలో పార్టీ నుండి మాకు ఒత్తిడి ఉన్న బయటికి వచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, మీరు అందరూ బయటికి రాకుంటే ఇబ్బంది అవుతోందని.. ఉద్యమంలో సక్సెస్ కాలేమని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లు కుల గణన జరగాలని కోరారు.