రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. సర్కార్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేయడంతో హైడ్రా పేరు సినీ, పొలిటికల్ సర్కిల్స్ మోరు మోగుతోంది. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టారు.. మరీ వాటిని కూల్చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ALSO READ | కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నివేదికలో కీలక విషయాలు
నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్టీఎల్ రేంజ్‌లోనే ఉందని.. మరీ నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు ఓవైసీ. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర గతంలో వాటర్ ఫాల్ ఉండేదని.. మరీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితేంటన్నారు. గోల్కొండలో ఉన్న గోల్ఫ్ కోర్టు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడే గోల్ఫ్ ఆడుతారని.. ఇప్పుడు గోల్ఫ్ కోర్టును కూల్చేస్తారా అని ప్రభుత్వానికి ఓవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, హైడ్రా ఏర్పాటు అయిన మొదట్లోనే బహదూర్‌పూర ఎంఐఎం ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.