హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేశారు. టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతనే జారీ చేస్తామని స్పష్టం చేశారు. 2025, మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చేస్తామని తెలిపారు. ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి వెంటనే ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరిగా రిజల్ట్ విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామని పేర్కొన్నారు. వచ్చే వారం పదిరోజుల తేడాతో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు.
టీజీపీఎస్సీ సిలబస్ పై కూడా స్టడీ చేస్తున్నామని.. గ్రూప్ -3కి మూడు నాలుగు పేపర్లు అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫార్మెట్లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. యూపీఎస్సీ ప్రతి ఏటా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. టీజీపీఎస్సీలో ఉద్యోగాలను బట్టి కొన్ని కంప్యూటర్ బేస్డ్, మరికొన్ని మ్యానువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఇక నుండి క్వశన్ పేపర్ విధానం మారుస్తామని.. ముందుగా క్వశన్ బ్యాంకు తయారు చేసి దాని నుండి క్వశన్ పేపర్లు సిద్ధం చేస్తానమి తెలిపారు.
ALSO READ | Railway Jobs: సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
ఒక్కొక్క సబ్జెక్టులో 5 నుండి 10 వేల వరకు బిట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తామన్నారు. మార్చి 31 లోపల వేకెన్సీ లిస్ట్ సర్కార్ నుండి రావాలి. ఏప్రిల్లో భర్తీపై కసరత్తు చేసి.. మే 1నుండి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. వెకెన్సీ లిస్ట్ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. ఇక నుండి ఇంటర్య్వూ ఉండే పోస్టులను సంవత్సరంలో.. ఇంటర్వ్యూ లేని వాటిని 6 నుండి 8 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు టీజీపీఎస్సీపై అపనమ్మకం, అపోహలు వీడాలని.. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామన్నారు.