
రోమ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మాటలు జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘‘ఒకరు వలసదారులను నియంత్రిస్తానని అంటుంటే.. మరొకరు అబార్షన్లకు అనుకూలమని అంటున్నారు. అందుకే రెండు చెడులలో తక్కువ చెడును ఎంచుకోవాలి. వారిద్దరిలో తక్కువ చెడు ఎవరు..? నాకు తెలియదు. మీరే మనస్సాక్షి ప్రకారం ఓటేయండి..” అని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు.