దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌: కేంద్రమంత్రి బండి సంజయ్

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌: కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బడ్జెట్‌ 2025-–26.. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్‌గా పేర్కొన్నారు. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఓ ప్రెస్​నోట్​రిలీజ్​చేశారు. ‘ఇన్​కమ్​ట్యాక్స్​మినహాయింపు వల్ల తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా ఐతది. 

గత 75 ఏండ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇది. రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే చాన్స్​ ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించే దిశగా బడ్జెట్‌ రూపకల్పన ఉంది. విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలి.. కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సహకరించాలి’ అని సూచించారు.