చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం: విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో విమానాలకు వస్తోన్న వరుస బాంబ్ థ్రెట్స్‎పై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నంలో ఆదివారం (అక్టోబర్ 27) ఆయన మీడియాతో మాట్లాడుతూ..- విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‎గా ఉందని తెలిపారు.

విమానాల్లో బాంబులు ఉన్నాయంటూ- సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోందని.. దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.- విచారణ తరువాత బాంబు బెదిరింపుల తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందన్నారు.- బాంబు బెదిరింపులను అరికట్టడానికి ట్విట్టర్, లా ఏజెన్సీలు, ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.- 

Also Read :- షాపింగ్ చేస్తే ఏడాది పొడవునా 5G డేటా ' ఫ్రీ'

సివిల్ ఏవియేషన్‎లో ఉన్న రెండు చట్టాలలో మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. -నూతన చట్టం తీసుకువచ్చి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.- బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారికి విమాన ప్రయాణం నిషేధించాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -రాష్ట్రంలో త్వరలో సి ప్లైన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.